Page Loader
Maharashtra: బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల
బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల

Maharashtra: బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తన 38 మంది అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో పార్టీ నాయకుడు అజిత్ పవార్‌ బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బారామతి అజిత్ పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. మహాయుతి కూటమిగా బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ శిండే వర్గం), ఎన్సీపీ కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. శివసేన కూడా 45 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే కోప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

Details

నవంబర్ 23న ఓట్ల లెక్కింపు

ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ థాకరే శివసేన) సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో, ప్రజలు అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో తేల్చే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న ఒకే దశలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుందని పేర్కొంది.