మహారాష్ట్ర: వార్తలు

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

18 Mar 2023

కోవిడ్

హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు

దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్ సోకి 9మంది మృతి చెందినట్లు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.

కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌

గతంలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన తెల్లటి రంగు ఆడి R8, మహారాష్ట్రలోని ఒక పోలీసు స్టేషన్ వెలుపల పాడుబడిన స్థితిలో గుర్తించారు. 2012లో ఈ R8 మోడల్ సూపర్‌కార్ ను కోహ్లి కొనుగోలు చేశారు.

15 Mar 2023

ముంబై

ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు

ముంబయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లాల్‌బాగ్ ప్రాంతంలో 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో లభ్యమైంది. మృతదేహాన్ని నెలల తరబడి గదిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతురాలు కుమార్తెపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు

మహారాష్ట్రలోని కందర్ లోహాలో మార్చి 26న జరిగే భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని పార్టీ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

09 Mar 2023

ముంబై

ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం

మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

06 Mar 2023

నాగపూర్

యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య

లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో బిడ్డను ప్రసవించింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని అంబజారి ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు అదును కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి తెలంగాణ బయట ఎన్నికలకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు.

23 Feb 2023

శివసేన

మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం

శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, థానే పోలీసులు అతనిపై పరువు నష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

15 Feb 2023

బస్

ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్

మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్‌తో బస్సులు వస్తుంటాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది వాటి రూపురేఖలు మారుతుంటాయి. మనం ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, బస్సులను చూశాం. కానీ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు మాత్రం చూడలేదు. అయితే మహారాష్ట్రలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సును జనవరి 13న ప్రారంభించారు.

13 Feb 2023

గూగుల్

గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్

మహారాష్ట్ర పుణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారించగా అది ఫేక్ కాల్ అని తేలింది.

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

భారత రాష్ట్ర సమితి రెండో బహిరంగ సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులకు అప్పగించారు.

ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023: భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన, చైనాకు సవాల్

మహారాష్ట్రలోని దేవ్‌లాలీలోని విశాలమైన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత సైన్యం తన ఆయుధ సత్తా ఏంటో చూపించింది. వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో శక్తివంతమైన ఆయుధాలను ప్రదర్శించి చైనాకు భారత్ సవాల్ విసిరింది. 'ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023' పేరుతో భారత సైన్యం ఈ ప్రదర్శనను చేపేట్టింది.

28 Jan 2023

గవర్నర్

మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!

బీజేపీ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియామకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత సుమిత్రా మహాజన్‌ను తదుపరి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమిత్రకు బదులుగా అమరీందర్ నియామకానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు

ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పెచ్చరిల్లుతున్నాయి. కొడలికి పిల్లలు పుట్టడం లేదని దారుణానికి ఒడిగట్టారు ఓ మహిళ అత్తమామలు. తాంత్రికుడు చెప్పిన మాటలు విని కొడలితో శ్మశానంలోని ఎముకలు, వాటి పొడిని తినిపించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ దారుణం జరిగింది.

19 Jan 2023

గోవా

ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి

మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.

నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి

మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ముంబయి పర్యటనకు వెళ్లారు. గురువారం ఆయన ముంబయిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొంటారు. దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగానే యోగి దేశమంతా పర్యటించనున్నారు. జనవరి 5 నుంచి జనవరి 27 వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ముఖ్యమైన నగరాల్లో నిర్వహించే రోడ్ షోల్లో యోగి పాల్గొనున్నారు.