Page Loader
Babli Project:బాబ్లీ గేట్ల ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు 
బాబ్లీ గేట్ల ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

Babli Project:బాబ్లీ గేట్ల ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టులోని గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14గేట్లు ఉన్న ఈ ప్రాజెక్టులో అన్ని గేట్లను పైకి లేపి బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహాన్ని నిరోధించకూడదని,అందుకే ఈ కాలంలో ప్రాజెక్టు గేట్లు ఎప్పుడూ తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. ఈఆదేశాలను అమలు చేస్తూ మంగళవారం ఉదయం కేంద్ర జల సంఘం అధికారులు బాబ్లీ గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈప్రక్రియను మహారాష్ట్ర,తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యక్షంగా సమీక్షించారు.

వివరాలు 

గోదావరిలో నీటి మట్టం పెరిగే అవకాశం

గేట్ల ఎత్తివేత వల్ల సుమారు ఒక టీఎంసీ వరద నీరు వచ్చేందుకు అవకాశముందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే నెలరోజులపైగా గడిచినా రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన మేరకు లేదు. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే బాబ్లీ ప్రాజెక్టు నుంచి వచ్చిన వరద నీరు శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బాబ్లీ నుంచి నీటి విడుదలతో గోదావరిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉండటంతో, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.