Page Loader
pune bridge collapse: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి 25 మంది గల్లంతు!
పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి 25 మంది గల్లంతు!

pune bridge collapse: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి 25 మంది గల్లంతు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పుణె సమీపంలోని కుండమాలాలో ఉన్న ఇంద్రాయణి నదిపై నిర్మించిన వంతెన ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన కుండమాలా, ముఖ్యంగా వర్షాకాలంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

 Details

ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల బృందాలు

ఈ నేపథ్యంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. అయితే వర్షాల కారణంగా వంతెన కూలిపోయింది. దీంతో వంతెనపై ఉన్న పర్యాటకులు నీటిలో పడిపోయారు. ప్రస్తుతం గల్లంతైన వారికోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటనా స్థలానికి అత్యవసర సేవల బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.