Ajit Pawar: అజిత్ పవార్ అంత్యక్రియలకు మోదీ, అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి బారామతిలోని విద్య ప్రస్థాన్లో గురువారం ఉదయం జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ నేత నితిన్ నబీన్ తదితరులు హాజరౌతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అజిత్ దాదా కడసారి చూపు కోసం రాజకీయ నేతలు, అభిమానులు బారామతిలోని ఆయన నివాసం వద్దకు క్యూ కడుతున్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే,ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే ఈ ఉదయం అజిత్ పవార్‌కు నివాళి అర్పించారు.
వివరాలు
అదుపు తప్పి కూలిపోయిన విమానం
అంత్యక్రియల ఏర్పాట్లను పవార్ కుటుంబం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులందరూ ఈ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, తన నియోజక వర్గం బారామతిలో జరగాల్సిన ప్రచార సభలకు అజిత్ పవార్ బుధవారం ఉదయాన్నే చార్టెడ్ ఫ్లైట్‌లో బయలుదేరారు. అయితే, ల్యాండింగ్ చివరి నిమిషంలో విమానం అదుపు తప్పి సమీపంలోని గోజుబావి గ్రామ సమీంలోని గుట్టల్లో కూలిపోయింది. విమాన అక్కడే ఉన్న బండ రాయిని బలంగా ఢీకొట్టడంతో విమానం రెండు భాగాలుగా విడిపోయి పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, పైలెట్‌లు,ఫ్లైట్ అటెండెంట్‌లతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
దుర్ఘటనపై విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో దర్యాప్తు
మృతదేహాలు కాలిపోవడంతో గుర్తించడం కష్టం అయ్యింది. అయితే చేతి వాచీ ఆధారంగా అజిత్ పవార్‌ను అధికారులు గుర్తించారు. ఈ ఉదయం మరణించిన వారందరి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీంతో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బంధువులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తరలించారు. ఈ దుర్ఘటనపై విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో (AAIB) ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది. ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించి, బ్లాక్ బాక్స్‌ను రికవరీ చేసి డీ-కోడ్ చేసుకునే పని జరుగుతోంది.