Loading...
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తులు.. ఎగుమతుల్లోనూ రికార్డు!
రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తులు.. ఎగుమతుల్లోనూ రికార్డు!

Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తులు.. ఎగుమతుల్లోనూ రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రక్షణ తయారీ రంగం ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తూ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరుకోగా, అందులో రూ.38,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు వెల్లడైంది. ఈ వివరాలను ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రక్షణ రంగ తయారీదారుల ఎంఎస్‌ఎంఈల ఫోరమ్‌ సదస్సులో వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, తెలంగాణ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ పీఏ ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

వివరాలు

ఎంఎస్‌ఎంఈల పాత్రపై ప్రత్యేక నివేదిక రిలీజ్

ఈ సందర్భంగా భారత రక్షణ రంగంలో ఎంఎస్‌ఎంఈల పాత్రపై ప్రత్యేక నివేదికను విడుదల చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 వేలకుపైగా రక్షణ రంగ ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తుండగా, ఒక్క తెలంగాణలోనే దాదాపు 1,700 సంస్థలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ప్రపంచంలో ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండగా, రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో 25వ స్థానంలో ఉందని వక్తలు పేర్కొన్నారు.

ఈ వ్యత్యాసాన్ని తగ్గించి దేశాన్ని రక్షణ ఎగుమతుల్లో ముందంజలో నిలపడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

వివరాలు

రక్షణ, ఏరోస్పేస్‌, డ్రోన్‌ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు

రక్షణ, ఏరోస్పేస్‌, డ్రోన్‌ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

ఈ రంగాల కోసం ప్రత్యేక రక్షణ, ఏరోస్పేస్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు అత్యాధునిక 'కామన్‌ టెస్టింగ్‌' సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.

దేశంలోనే క్లిష్టమైన ముడి పదార్థాల ఉత్పత్తికి ఎంఎస్‌ఎంఈలు ముందుకు రావాలని మిధాని సీఎండీ ఎస్‌వీఎస్‌ నారాయణ మూర్తి పిలుపునిచ్చారు.

ఇస్రో, డీఆర్‌డీఓ, ఏరోస్పేస్‌ రంగ అవసరాల కోసం మిధాని ప్రస్తుతం 500 రకాల ప్రత్యేక అల్లాయ్స్‌ను తయారు చేస్తోందని చెప్పారు.

అలాగే మిధాని కొనుగోళ్లలో 50 శాతానికి పైగా ఎంఎస్‌ఎంఈల నుంచే సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT