Katrina Kaif: కత్రినా బరువుపై ట్రోలింగ్.. గట్టిగా స్పందించిన నటి
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం బరువు పెరిగారంటూ సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై నటి సోనారికా భడోరియా స్పందించారు. తల్లి అయిన తర్వాత మహిళల శరీరంలో సహజంగా చోటుచేసుకునే మార్పులను ప్రశ్నించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో కత్రినాకు మద్దతుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం కత్రినా కైఫ్‌కు సంబంధించిన అంశం మాత్రమే కాదని.. ప్రతి మహిళా ఇలాంటి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారని సోనారికా అన్నారు. ''బిడ్డకు జన్మనివ్వడం చిన్న విషయం కాదు. ఆ సమయంలో మహిళ శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. ప్రసవం తర్వాత కోలుకునేందుకు ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది.
వివరాలు
ఇతరులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
అలాంటప్పుడు ఆమె ఎలా కనిపిస్తోంది? ఎంత బరువు పెరిగింది? అనే దానికంటే.. ఆమె బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎంత కష్టపడింది.
ఆ బిడ్డను పెంచడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడపనుంది.. వంటివి అర్థం చేసుకోవడం ముఖ్యం. తల్లి కావడానికి మహిళలు సర్వస్వం త్యాగం చేయాలని చెప్పే ఈ ప్రపంచంలో.. మాతృత్వం అనంతరం ఆమె శరీరంలో ఎలాంటి మార్పు రాకూడదని ఆశించే వాళ్లు కూడా ఉండడం సిగ్గుపడాల్సిన విషయమని సోనారికా భడోరియా పేర్కొన్నారు.
మహిళలు తమ శరీరంలో చోటుచేసుకునే మార్పుల గురించి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సోనారికా స్పష్టం చేశారు.
ఇతరులు చేసే వ్యాఖ్యలను పట్టించుకుని తమను తాము తక్కువగా భావించుకోవద్దని సూచించారు.
వివరాలు
మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి
ప్రసవం తర్వాత మహిళల మానసిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు ప్రసవానంతరం ఉన్న మహిళలను బాధించే అవకాశం ఉందని.. అందువల్ల వారితో వ్యవహరించే సమయంలో కాస్త సున్నితంగా ఉండాలని సోనారికా సూచించారు.
ఇక సోనారికా భడోరియా 2011లో 'జాదుగాడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'స్పీడున్నోడు', 'ఈడోరకం- ఆడోరకం' చిత్రాల్లో నటించారు.
హిందీలో సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ ఆమె నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.