Loading...
Trump: ఇరాన్‌పై యుద్ధానికి బ్రేక్.. ట్రంప్‌ కీలక నిర్ణయం!
ఇరాన్‌పై యుద్ధానికి బ్రేక్.. ట్రంప్‌ కీలక నిర్ణయం!

Trump: ఇరాన్‌పై యుద్ధానికి బ్రేక్.. ట్రంప్‌ కీలక నిర్ణయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై ప్రతిపాదిత సైనిక చర్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై తలపెట్టిన సైనిక దాడి ప్రణాళికలను రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తినే ట్రంప్‌ పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, ఇరాన్‌ అణు ముప్పును పూర్తిగా అంతం చేయడం వంటి కీలక అంశాలతో కూడిన ప్రతిపాదిత ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని ఇరాన్‌తో పాటు ఇతర మధ్యప్రాచ్య దేశాలు కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పించేందుకు ఇరాన్‌పై ప్రతిపాదించిన సైనిక దాడి ప్రణాళికలను తాత్కాలికంగా విరమించుకోవాలని నిర్ణయించినట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT