Ajit Pawar: మేఘాల్లో హెలికాప్టర్ ప్రయాణం.. 2024లోనే అజిత్ పవార్ కి విమాన ప్రమాదం అనుభవం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు 2024లోనూ విమాన ప్రమాదం వంటి భయంకర అనుభవం ఎదురైంది. అప్పట్లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ఆయన దేవుడి పేరును తలచుకుంటూ భయం భయంగా గడిపారు. అయితే ఆ ప్రమాదం సమయంలో ఆయనతోపాటు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, మరొక రాజకీయ నాయకుడు త్రుటిలో తప్పించుకున్నారు. వారి హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత జరిగిన సభలో ఆయన తన అనుభవాన్ని వివరించారు.
వివరాలు
పాండురంగా.. పాండురంగా..
2024 జులై 17వ తేదీన ఫడణవీస్, అజిత్ పవార్, ఉదయ్ సామంత్ కలిసి నాగ్‌పుర్ నుంచి గడ్చిరోలి వైపు ప్రయాణం ప్రారంభించారు. "'తొలుత మా హెలికాప్టర్ బాగానే టేకాఫ్ అయింది. అది మేఘాల్లోకి ప్రవేశించగానే ఏమీ కనిపించడం లేదని ఫడణవీస్‌తో చెప్పా. చెట్లు, నేల, ఏమీ కనిపించడం లేదని అన్నా. మనం ఎక్కడకు వెళ్తున్నామో తెలియట్లేదని వివరించా.. అయితే ఫడణవీస్ ఎంతో సున్నితంగా స్పందించి, "ఆందోళన చెందవద్దు. ఇలాంటి పరిస్థితులను గతంలో 6 సార్లు ఎదుర్కొన్నాను. హెలికాప్టర్‌గానీ, విమానంగానీ ప్రమాదం రాదు" అని యన చెప్పారు. కానీ అప్పటికే నాలో భయం మొదలైంది. దీంతో పాండురంగా.. పాండురంగా అనుకుంటూ కూర్చున్నా' అని అజిత్ పవార్ వివరించారు