LOADING...
Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు
సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు

Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా, కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో, బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున సుమారు 1:00 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పేలుడు సమయంలో ఆ కంపెనీలో సుమారు 900 మంది కార్మికులు ఉన్నారు. అదృష్టవశాత్తు, ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. అయితే, ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు, మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలపాలైనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

గతంలో కూడా ఇలాంటి పేలుడు ఘటనలు 

ఒక గాయపడిన కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ, "రియాక్టర్ నుండి పొగలు రావడాన్ని చూసి, మేము అందరం బయటకు పరుగెత్తాం. 25 నిమిషాల తర్వాత పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావంతో ఎగిరి పడ్డ రాళ్ల కారణంగా దాదాపు 50 మంది గాయపడ్డారు" అని వివరించారు. కాగా సోలార్ యూనిట్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారేమీ కాదని.. గతంలో కూడా ఇలాంటి పేలుడు ఘటనలు సంభవించినట్లు వారు పేర్కొన్నారు. పోలీసు అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు ప్రారంభించారని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పోద్దార్ తెలిపారు. ప్రస్తుతం, పేలుడికి సరైన కారణం తెలియనప్పటికీ, గాయపడిన వారిని సమీప ఆసుపత్రుల్లో తరలించి వైద్యసహాయం అందిస్తున్నట్లు తెలిపారు.