Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌ను చంపుతామని బెదిరింపులు.. పోలీసుల అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. తమ వర్గాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఫోన్‌లో ఎంపీని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడు రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి కాల్ చేసి ఈ బెదిరింపులు చేశాడు. 'రవి కిషన్ మా వర్గాన్ని అవమానించాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. అతని ప్రతి కదలిక నాకు తెలుసు. వచ్చే నాలుగు రోజుల్లో బిహార్‌కు వచ్చేటప్పుడు చంపేస్తామని ఆ వ్యక్తి చెప్పినట్లు ద్వివేదీ పోలీసులకు తెలిపాడు. అలాగే ఎంపీపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా పేర్కొన్నాడు.
Details
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అయితే రవి కిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేదీ స్పష్టం చేశారు. దర్యాప్తులో నిందితుడిని బిహార్ రాష్ట్రంలోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీ సిబ్బంది గోరఖ్‌పుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీకి భద్రతను కట్టుదిట్టం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, తాజా బెదిరింపులపై రవి కిషన్ స్పందించారు.
Details
రవికుమార్ స్పందన ఇదే
గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో తనను దూషించడమే కాకుండా తన తల్లి గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడాడని తెలిపారు. ఇటువంటి చర్యలు సమాజంలో ద్వేషం, అరాచకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామని చెప్పారు. ఈ బెదిరింపులకు నేను భయపడనని, ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవడం నా రాజకీయ వ్యూహం మాత్రమే కాదని, జీవిత సంకల్పం కూడా అని రవి కిషన్ స్పష్టం చేశారు.