Ajit Pawar passes away: టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి యత్నించి.. రాయిని ఢీకొట్టి..!
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో బుధవారం ఉదయం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్దటనలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా మరో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన నేపథ్యంలో, పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం రెండు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో విమానం ఓ బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
వివరాలు
విమాన ప్రయాణ వివరాలు:
అజిత్ పవార్ బుధవారం ఉదయం 8:10 గంటలకు ముంబై నుండి పుణె బారామతిలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో సాంకేతిక సమస్య ఎదురవడంతో, 8:30 గంటలకు పైలట్ ల్యాండింగ్ ప్రయత్నం చేశారు. అది సఫలం కాకపోవడంతో, 8:42 గంటలకు మరోసారి అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో విమాన నియంత్రణ కోల్పోయి, రన్‌వేకు అత్యంత సమీపంలో కుప్పకూలింది.
వివరాలు
ప్రమాద పరిస్థితులు:
ఈ ప్రమాద సమయంలో పుణె,బారామతి ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దాంతో విజిబిలిటీ తక్కువగా ఉండటం కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండతీరం ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం నియంత్రణ కోల్పోవడం, ఒక బండరాయిని ఢీకొట్టడం, విమానంలో భారీ మంటలు చెలరేగడం ప్రమాద తీవ్రతను పెంచాయి.