Loading...
IMD Forecast: పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన
పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

IMD Forecast: పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల వైపు వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ విదర్భతో పాటు దక్షిణ మధ్యప్రదేశ్‌ ప్రాంతాల మీదుగా మరింత ముందుకు సాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని సంస్థ పేర్కొంది.

వివరాలు 

ఈ జిల్లాలో తేలికపాటి వర్షాలు 

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

ADVERTISEMENT