LOADING...
Nagpur: మహారాష్ట్రలో మద్యం మత్తులో ఆర్మీ ఆఫీసర్‌ హల్‌చల్.. దేహశుద్ది చేసిన స్థానికులు.. 
మహారాష్ట్రలో మద్యం మత్తులో ఆర్మీ ఆఫీసర్‌ హల్‌చల్.. దేహశుద్ది చేసిన స్థానికులు..

Nagpur: మహారాష్ట్రలో మద్యం మత్తులో ఆర్మీ ఆఫీసర్‌ హల్‌చల్.. దేహశుద్ది చేసిన స్థానికులు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ ఆర్మీ ఆఫీసర్‌ తన కారు నియంత్రణ కోల్పోయి దాదాపు 25 నుంచి 30 మందిని ఢీకొట్టాడు. దీంతో స్థానికులు అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పారు. 40 ఏళ్ల హర్షపాల్ మహాదేవ్ వాఘ్మారే అనే వ్యక్తి అస్సాం రాష్ట్రంలో భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల సెలవులో భాగంగా మహారాష్ట్రకు వచ్చిన అతను, నాగర్‌ధన్ ప్రాంతంలోని దుర్గా చౌక్ నుంచి హంలాపురి వైపు ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో కారులో ప్రయాణిస్తున్నాడు. అయితే మద్యం తాగిన స్థితిలోనే వాహనం నడిపినట్టు అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

డ్రైనేజీలో పడిపోయిన కారు 

అతను వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పోయాడు. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే బీభత్సం సృష్టించి, రోడ్డుపై నడుస్తున్న 25 మందికిపైగా ఢీకొట్టాడు. తర్వాత కారు పల్టీ కొట్టి ఓ డ్రైనేజీలో పడిపోయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్రంగా ఆగ్రహించారు. కారు పడిపోయిన డ్రెయిన్ నుంచి వాఘ్మారేను బయటకు లాగి గట్టిగా కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడి వ్యక్తులు వీడియో తీయగా, అతని ముఖం నుంచి రక్తం కారుతుండగా గట్టిగా నిట్టూరుస్తూ భయంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. ఆ తర్వాత రామ్‌టెక్ పోలీసులు అక్కడకు చేరుకుని వాఘ్మారేను అరెస్ట్ చేసి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహారాష్ట్రలో మద్యం మత్తులో ఆర్మీ ఆఫీసర్‌