Plane Crash: గో-ఎరౌండ్ పాటించిన పైలట్లు.. పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదు! - డీజీసీఏ
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 28, 2026
02:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై తాజాగా కీలక వివరాలు బయటకు వచ్చాయి. విమానం ల్యాండింగ్ చేసే సమయంలో రన్‌వేను స్పష్టంగా గుర్తించడంలో పైలట్లకు సమస్యలు ఎదురైనట్లు సమాచారం. మొదటి ప్రయత్నంలో రన్‌వే కనబడకపోవడంతో విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టారని తెలుస్తోంది. అనంతరం రెండోసారి ల్యాండింగ్‌కు ముందుగా భద్రతా చర్యగా గో-ఎరౌండ్ విధానాన్ని పాటించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో విమానం ఆపదలో ఉందని సూచించే మేడే కాల్స్‌ను పైలట్లు పంపలేదని డీజీసీఏ వర్గాలు స్పష్టం చేశాయి.