
Mumbai: పప్పు విషయంలో గొడవ.. క్యాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. శివసేన షిండే వర్గానికి చెందిన బుల్దానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ముంబయిలోని ఓ ప్రభుత్వ అతిథిగృహంలోని క్యాంటీన్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తనకు ఇచ్చిన పప్పులో దుర్వాసన వస్తోందంటూ, ఆగ్రహంతో కార్మికుడిపై తీవ్రంగా దాడి చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో, ఎమ్మెల్యే గైక్వాడ్ ముంబయిలోని ప్రభుత్వ ఆకాశవాణి గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. భోజనానికి ఆర్డర్ ఇచ్చిన గైక్వాడ్‌కు అందిన పప్పులో దుర్వాసన వస్తోందని.. వెంటనే క్యాంటీన్ వద్దకు టవల్‌తోనే వచ్చారు.
వివరాలు
క్యాంటీన్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు: ఎమ్యెల్యే
"ఇది ఎవరు వండారు?" అంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. అప్పటికే అందిన ప్యాకెట్‌ను తెరిచి అందులోని వాసన చూపిస్తూ, "ఇది తిన్న తర్వాత కడుపు నొప్పి, అసౌకర్యం ఏర్పడింది" అని అన్నారు. తనకు తాజా ఆహారాన్ని ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ అందలేదని తెలిపారు. ఇలా అనేక మందికి ఆహారం అందించే క్యాంటీన్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. "ఎవరు దీనిని నాకు ఇచ్చారు? ఈ పప్పును ఓ ఎమ్మెల్యేకు ఎలా ఇవ్వగలరు? ఇది వాసన చూడండి. నాకే ఇలాంటి ఆహారం ఇస్తే, సామాన్యులకు ఏం వడ్డిస్తారు?" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫుడ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
వివరాలు
సోషల్ మీడియాలో వేగంగా వైరల్
ఈ వాగ్వాదం కాస్తా ముదిరి, ఎమ్మెల్యే గైక్వాడ్ ఆ క్యాంటీన్ ఆపరేటర్‌పై నేరుగా దాడికి దిగారు. అతడి చెంపపై గట్టిగా కొట్టడంతో పాటు పిడిగుద్దులు కూడా వేశారు. దాంతో ఆ కార్మికుడు నేలపై పడిపోయాడు. అక్కడి సిబ్బంది, ఇతరులు జోక్యం చేసుకొని దాడిని ఆపేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే దాడిని ఆపలేదు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ దాడిపై పలువురు మండిపడుతున్నారు. అయినప్పటికీ, ఎమ్మెల్యే గైక్వాడ్ మాత్రం తన చర్యపై ఏమాత్రం విచారం వ్యక్తం చేయలేదు. దీన్ని "శివసేన స్టైల్" అంటూ సమర్థించుకున్నారు. అయితే ఇప్పటివరకు శివసేన - శిందే వర్గం ఈ వ్యవహారంపై స్పందించకపోవడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Buldhana MLA Sanjay Gaikwad is a Maratha warrior, who singlehandedly defeated a canteen staff in full public view pic.twitter.com/i3UHuPepP9
— ᴋᴀᴍʟᴇsʜ sɪɴɢʜ / tau (@kamleshksingh) July 9, 2025