Page Loader
Mumbai: శతాబ్దం కన్నా ఎక్కువ పొదుపుతోనే ముంబైలో స్వంత ఇంటి కల!
శతాబ్దం కన్నా ఎక్కువ పొదుపుతోనే ముంబైలో స్వంత ఇంటి కల!

Mumbai: శతాబ్దం కన్నా ఎక్కువ పొదుపుతోనే ముంబైలో స్వంత ఇంటి కల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనాలంటే మహారాష్ట్రలోని అగ్రశ్రేణి కుటుంబాలకే శతాబ్దానికి పైగా పొదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా డేటా ప్రకారం, రాష్ట్రంలో టాప్‌ 5 శాతం ఆదాయ గల కుటుంబాలు, నెలకు సగటున రూ. 10.7 లక్షలు సంపాదించే వారు కూడా ముంబైలో సగటు ఇంటిని కొనుగోలు చేయాలంటే 109 సంవత్సరాలపాటు డబ్బును ఆదా చేయాల్సి ఉంటుంది. 21 భారతీయ రాజధానుల్లో ముంబైకే ఇళ్ల ధరల భారం అత్యంత ఎక్కువని ఈ నివేదిక పేర్కొంది.

Details

ఇంటిని సొంతం చేసుకోవాలంటే శతాబ్దానికి పైగా శ్రమించాల్సిన ఉంది

నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు (NHB) డేటా, పట్టణ ఆదాయ అంచనాలను ఆధారంగా చేసుకుని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన ఈ నివేదికలో ముంబైలోని ఒక ప్రామాణిక ఇంటి (1,184 చదరపు అడుగుల) ధర, టాప్‌ 5 శాతం కుటుంబాల వార్షిక ఆదాయాన్ని పరిశీలించారు. మహారాష్ట్రలో ఈ ఉన్నత వర్గం ఏడాదికి సుమారు రూ. 10.7 లక్షలు సంపాదిస్తుండగా, జాతీయ సగటు పొదుపు రేటు (30.2%) ప్రకారం ఏడాదికి సుమారు రూ. 3.2 లక్షలు ఆదా చేయగలరు. అయితే ముంబైలో ఇంతకుగానీ ఇంటి ధర రూ. 3.5 కోట్లకుపైగా (2025 మార్చి నాటికి చదరపు అడుగుకు రూ. 29,911 రేటుతో) ఉన్నందున, ఇంటిని సొంతం చేసుకోవాలంటే శతాబ్దానికి పైగా శ్రమించాల్సిన పరిస్థితి తలెత్తింది.

Details

ఇతర ప్రధాన నగరాల పరిస్థితి కూడా అదే! 

కేవలం ముంబైకే కాకుండా ఇతర ముఖ్య నగరాల పరిస్థితి కూడా అంతే ఆందోళనకరం. హరియాణాలోని గుర్గావ్‌లోని టాప్‌ 5 శాతం ఆదాయ కుటుంబాలకే ఇల్లు కొనాలంటే 64 సంవత్సరాలపాటు పొదుపు చేయాల్సి ఉంటుందని డేటా సూచిస్తోంది. ఐటీ కేంద్రం బెంగళూరులో అది 36 సంవత్సరాలు, ఢిల్లీలో 35 సంవత్సరాల పొదుపు అవసరం. ఇతర రాజధానులతో పోలిస్తే చండీగఢ్ మాత్రం కొంత సరసైనది. అక్కడ ఇల్లు కొనేందుకు 15 సంవత్సరాల పొదుపే సరిపోతుంది.