LOADING...
Theft case: 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7 కేసు.. ముంబై కోర్టు కీలక తీర్పు
50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7 కేసు.. ముంబై కోర్టు కీలక తీర్పు

Theft case: 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7 కేసు.. ముంబై కోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో దాదాపు 50 ఏళ్ల క్రితం నమోదైన ఓ చోరీ కేసుకు ఎట్టకేలకు తెరపడింది. కేసులోని ఇద్దరు నిందితులే కాకుండా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆచూకీ కూడా దశాబ్దాలుగా లభించకపోవడంతో ఈ కేసును ఇక కొనసాగించాల్సిన అవసరం లేదని స్థానిక న్యాయస్థానం స్పష్టం చేసింది. దక్షిణ ముంబయిలోని మజగావ్ కోర్టు పాత పెండింగ్ కేసులను సమీక్షించే క్రమంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 1977లో నమోదైన ఈ కేసులో అప్పట్లో రూ.7.65 చోరీ జరిగిందని ఫిర్యాదు చేశారు. నేటి ప్రమాణాలతో చిన్న మొత్తం అయినప్పటికీ, ఆ కాలంలో ఇది గణనీయమైన మొత్తమే. అయితే, ఈ కేసులో నిందితులుగా గుర్తించిన ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ఎన్నిసార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా ఫలితం లేకపోయింది.

Details

అర్ధ శతాబ్దం గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదు

వారి ఆచూకీ తెలియకపోవడంతో కేసు సంవత్సరాల పాటు నిశ్చల స్థితిలోనే కొనసాగింది. ఇటీవల ఈ కేసును విచారించిన న్యాయస్థానం అర్ధ శతాబ్దం గడిచినా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనించి, ఇలాంటి పరిస్థితుల్లో కేసును కొనసాగించడం అర్థరహితమని అభిప్రాయపడింది. దీంతో నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసులో రికవరీ చేసిన రూ.7.65ను ఫిర్యాదుదారుడికి అందజేయాలని ఆదేశించింది. అయితే అప్పీల్ గడువు పూర్తయ్యేలోగా ఫిర్యాదుదారుడి ఆచూకీ లభించని పక్షంలో, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ చోరీ కేసుకు న్యాయస్థానం అధికారికంగా ముగింపు పలికింది.

Advertisement