LOADING...
Ajit Pawar Death: అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి..
అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి..

Ajit Pawar Death: అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశమంతటా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ ప్రాణాలు కోల్పోయారు. బారామతి సమీపంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కూలిపోయిందని, ఈ ప్రమాదంలో అజిత్‌ పవార్‌తో పాటు మరో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రధాని మోదీ, అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న అంశాలపై ఆరా తీశారు.

వివరాలు 

అజిత్‌ పవార్ ఆకస్మిక మృతి నన్ను కలిచివేసింది: మోడీ 

అజిత్‌ పవార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. అజిత్‌ పవార్ ప్రజల మధ్య నుంచి ఎదిగిన నాయకుడిగా, గ్రామ స్థాయి వరకు ప్రజలతో బలమైన అనుబంధం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజల సేవలో నిరంతరం శ్రమించిన కష్టపడే నాయకుడిగా ఆయనకు విశేష గౌరవం ఉందని తెలిపారు. పాలనపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, పేదలు,అణగారిన వర్గాలను బలోపేతం చేయాలనే ఆయన నిబద్ధత ప్రశంసనీయమని ట్వీట్‌లో వెల్లడించారు. అజిత్‌ పవార్ అకస్మాత్తుగా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్  

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిత్ షా చేసిన ట్వీట్ 

Advertisement