Thekdi Ganapati: 250 ఏళ్ల వైభవం.. పరిమాణంలో పెరుగుతూ వచ్చే స్వయంభు వినాయకుడిని చూసారా?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో, మహారాష్ట్రలోని, నాగ్‌పుర్కర్‌లోని 250 ఏళ్లనాటి తెక్డీ గణపతి ఆలయం సోషల్ మీడియా ద్వారా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆలయంలోని వినాయకుడి ప్రతిమ స్వయంభుగా వెలిసింది అని స్థానికులు పేర్కొన్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే.. మొదట ఈ స్వామివారి ప్రతిమ మూడు అడుగుల పరిమాణంలో ఉండగా, కాలానుగుణంగా స్థాయిగా పెరిగి మహాగణపతి స్థాయికి చేరిందని భక్తులు చెబుతున్నారు. భక్తుల నమ్మకం ప్రకారంఈ ఆలయంలో ఏదైనా కోరికను కోరితే అది నెరవేరుతుంది.
వివరాలు
ఆలయాన్ని 1702లో గోండు రాజు భక్త్ బులంద్ షా నిర్మించారు
అందుకే ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి,స్వామిని దర్శించుకుంటారు. స్థానికుల సమాచారం ప్రకారం,ఈ ఆలయాన్ని గోండు రాజు భక్త్ బులంద్ షా 1702లో నిర్మించారు. ఈ మహాగణపతి పరిమాణంలో పెరుగుతూ, భక్తుల ఆరాధనకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పుడే మీకూ ఈ పరిమాణంలో పెరుగుతున్న తెక్డీ గణపతిని ప్రత్యక్షంగా చూడవచ్చు.