LOADING...
Kangana Ranaut: నా బంగ్లాను కూల్చిన వారిని ప్రజలే బయటకు పంపారు: కంగనా రనౌత్
నా బంగ్లాను కూల్చిన వారిని ప్రజలే బయటకు పంపారు: కంగనా రనౌత్

Kangana Ranaut: నా బంగ్లాను కూల్చిన వారిని ప్రజలే బయటకు పంపారు: కంగనా రనౌత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బృహన్ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)లో అతిపెద్ద పార్టీగా అవతరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఫలితాలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన ముంబయిలోని కార్యాలయ కూల్చివేత ఘటనను గుర్తు చేసుకున్న కంగనా, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "బీఎంసీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడం చాలా గొప్ప విషయం. ఒకప్పుడు నన్ను వేధించిన వారు, నా బంగ్లాను కూల్చేసిన వారు, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోవాలని నన్ను బెదిరించిన వారిని ఇప్పుడు రాష్ట్రమే వదిలేసింది.

Details

ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు

మహిళలపై ద్వేషభావం కలిగిన బంధుప్రీతి మాఫియాకు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని అంటూ ఆమె వ్యాఖ్యానించారు. 2020లో ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న కంగనా రనౌత్‌ కార్యాలయంలోని కొంత భాగాన్ని అప్పటి బీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు. ఈ చర్యపై కంగనా అప్పట్లో ముంబయి కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అధికారుల నటికి జరిగిన నష్టాన్ని బీఎంసీనే భర్తీ చేయాలి" అంటూ కోర్టు అప్పట్లో తీర్పు వెలువరించింది.

Details

కూల్చివేత అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం

అదే సమయంలో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తుపై స్పందించిన కంగనా, మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే తనకు ఎక్కువ భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. దీంతో శివసేన నేతలు, కంగనా మధ్య కొద్ది రోజుల పాటు తీవ్ర మాటల యుద్ధం సాగింది. ఆ నేపథ్యానికే కార్యాలయ కూల్చివేత జరగడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement