Page Loader
Dharavi : ముంబైలోని ధారావిని ఆధునీక‌రించేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు ఆమోదం 
ముంబైలోని ధారావిని ఆధునీక‌రించేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు ఆమోదం

Dharavi : ముంబైలోని ధారావిని ఆధునీక‌రించేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపుపొందిన ముంబైలోని ధారావిను ఆధునీకరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళిక ద్వారా ధారావి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా, అక్కడి వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఈ పునరాభివృద్ధి ప్రణాళిక అమలుతో ధారావి సామాజిక, సాంస్కృతిక స్వభావానికి ఏమాత్రం భంగం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్థానికుల సంస్కృతి,జీవన శైలి తదితర విశిష్టతలన్నీ కొనసాగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

వివరాలు 

పునర్నిర్మాణ ప్రాజెక్టును నవభారత్ మెగా డెవలపర్స్ కి అప్పగించింది 

ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టును నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ ప్రణాళికకు అధికారిక ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఏకనాథ్ షిండే, అలాగే ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు సీఎస్‌ఈఓ ఎస్‌వీఆర్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.