Maharastra: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..డిప్యూటీ సీఎంతో పాటు ఆరుగురు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 28, 2026
09:57 am
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక సమయానికి ఉదయం 8.45 గంటలకు ఈ ఘోర ఘటన చోటు చేసిందని అధికారులు తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపుతప్పి క్రాష్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలోనే విమానం కూలిపోగా,వెంటనే తీవ్రమైన మంటలు చెలరేగాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం
Ajit Pawar's Plane Crash Lands In Maharashtra's Baramati. More details awaited. pic.twitter.com/geD8G9meXK
— Ashoke Raj (@Ashoke_Raj) January 28, 2026