Bypoll results: ఉపఎన్నికలలో ఇండియా కూటమి జోరు.. ఇండియా కూటమికి 10 సీట్లు, బీజేపీ 2 సీట్లు
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో 'ఇండియా కూటమి' జయకేతనం ఎగురవేసింది. 10 చోట్ల కూటం విజయం సాధించగా .. బీజేపీ రెండు, మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ లో 4,హిమాచల్ ప్రదేశ్ లోని మూడు, ఉత్తరాఖండ్ లోని రెండు, పంజాబ్, బిహార్,తమిళనాడు,మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్థానానికి ఈ నెల 10న ఉపఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ విజయం
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎన్నికలకు వెళ్లిన మొత్తం నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఇది ఎనిమిదేళ్ల తర్వాత బాగ్దా, రణఘాట్ దక్షిణ్‌లలో TMC తిరిగి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. రూపాలి ఉప ఎన్నికలో అధికార జనతాదళ్ (యునైటెడ్)పై బీహార్ ఎమ్మెల్యే శంకర్ సింగ్ విజయం సాధించారు.