Loksabha Elections- RBI: లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్ సభ (Loksabha) ఎన్నికలకు ముందు భారత రిజర్వు బ్యాంకు (RBI) (ఆర్బీఐ)కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎక్కువ మొత్తంలో లేదా అనుమానాస్పద లావాదేవీలను తమకు నివేదించాలని బ్యాంకు యేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరికీ (పీఎస్ఓ)లకు ఆదేశాలు జారీ చేసింది.
ఓటర్లును ప్రభావితం చేయడానికి లేదా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిధులు చేర్చేందుకు వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలను అనుసరించే అవకాశాలున్నాయని అటువంటి లావాదేవీలను లేదా నగదు వ్యవహారాలను తమ దృష్టికి తీసుకురావాలని పీఎస్ ఓలకు ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు నాన్ బ్యాంకు పీఎస్ ఓ లకు ఏప్రిల్ 15న ఆర్బీఐ లేఖ రాసింది.
ఈ ఆదేశాలో ఏప్రిల్ 19 వ తేదీనే అమలులోకి వచ్చినట్లు ఆర్.బి.ఐ పేర్కొంది.
RBI-Orders
ఆ జాబితాలో ఉన్నవి ఇవీ...
పేమెంట్ గేట్ వేలు, అగ్రిగేటర్ లు, చెల్లింపు యాప్లు, ఆన్ లైన్ లో లావాదేవీలు కొనుగోలు దారులు, విక్రేత ల మధ్య చెల్లింపులను ఈజీ చేసే, సెటిల్ చేసే కార్డ్ నెట్ వర్క్స్ ఉన్నాయి.
వీటితో పాటు రోజర్ పే, ఎం స్వైప్, ఇన్ఫీబీమ్ ,పేయూ, క్యాష్ ఫ్రీ, లాంటి చెల్లింపు గేట్ వేలతోపాటు భారత్ పే (Bharath Pay), ఫోన్ పే (Phone Pay), మొబీక్విక్, గూగుల్ పే (Google Pay) వంటి చెల్లింపుల యాప్ లు కూడా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపింణీ చేసే అవకాశముందని ఎన్నికల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.