One nation one election : ఈ టర్మ్‌లోనే 'ఒక దేశం, ఒకే ఎన్నికలు'అమలుపై మోదీ సర్కార్ కసరత్తులు
జమిలి ఎన్నికలపై ఎన్డీయే కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈసారి టర్మ్‌లోనే "ఒకే దేశం- ఒకే ఎన్నికలు" నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని సమాచారం ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రణాళికలపై ఇతర పార్టీలకు అభ్యంతరం ఉందని వచ్చిన వార్తలను బీజేపీ సీనియర్ నేత కొట్టిపారేశారు.
ఒకే దేశం - ఒకే ఎన్నికలు
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రధాని అన్ని రంగాల్లో సుస్థిర విధానాలు,సాక్ష్యాల ఆధారిత సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దేశం వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ను ప్రస్తుత ప్రభుత్వ కాలంలో అమలు చేస్తామని బీజేపీ సీనియర్ నేత వెల్లడించారు. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని మోదీ, తరచూ ఎన్నికలు జరుగుతుండడం దేశ అభివృద్ధి యాత్రకు అడ్డంకి అవుతోందని,జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల పాలన మీద పడే ప్రభావం తగ్గుతుందని,ప్రభుత్వాలు అత్యవసర నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకట్ట పడుతుందని అన్నారు.
పార్టీల స్పందన
జనతాదళ్ (యునైటెడ్) ఈ జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతు తెలుపుతుండగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఈ అంశంపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీకి ఇంకా స్పందించలేదు. మిత్రపక్షాల నుంచి బీజేపీకి ఒత్తిడి ఉందని, లోక్‌సభలో బీజేపీ బలం తగ్గిందన్న ఊహాగానాలకు సీనియర్ నేత ప్రకటనతో తెరపడింది. ఇతర పరిణామాలు కేంద్రం తీసుకున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు,బ్యూరోక్రసీలో లేటరల్ ఎంట్రీ రద్దు,ఆస్తులపై ఇండెక్సేషన్ ప్రయోజనాల తొలగింపు వంటి నిర్ణయాలు మిత్రపక్షాల ఒత్తిడితోనే జరిగాయని అనుకుంటున్నారు.
పొత్తులు
2023 మార్చ్‌లో,మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై సిఫార్సు చేసింది. ఇందులో,మొదటగా లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని,ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని సూచించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మార్క్‌కి తక్కువ సీట్లు గెలుచుకోవడంతో, జేడీ(యూ), టీడీపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.