Page Loader
Election Results: కాంగ్రెస్‌ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆధిక్యం
కాంగ్రెస్‌ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆధిక్యం

Election Results: కాంగ్రెస్‌ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆధిక్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2024
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా,జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల (Election Results) కౌంటింగ్‌ మంగళవారం జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం, హరియాణాలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా కొనసాగుతోంది, ఇప్పటివరకు 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజేపి కూడా గట్టిపోటీ ఇస్తోంది. ప్రస్తుతం 24 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ ఒక స్థానంలో, ఇతర పార్టీలు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు ఏ స్థానంలోనూ విజయం సాధించలేదు, ఇది గమనించదగ్గ విషయం.

వివరాలు 

జమ్మూకశ్మీర్‌లో..

జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ దూసుకెళ్తోంది.ప్రస్తుతం 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 14, పీడీపీ 4, కాంగ్రెస్‌ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ స్వతంత్రంగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కలిసి పోటీ చేస్తున్నాయి.