Prajwal Revanna-Devegouda-Sex Videos: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబసభ్యులు, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు
మాజీ ప్రధాని హెచ్ డీ దేవ గౌడ(Devegouda)కుటుంబ సభ్యులపైన, ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పైనా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గతంలో దాదాపు 3,000 మహిళల వీడియోల(Sex Videos)తో కూడిన పెన్ డ్రైవ్ (Pen Drive)తనకు అందిందని 2023 డిసెంబర్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశానని కర్ణాటక (Karnataka)లోని ఓ బీజేపీ నాయకుడు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులతో సహా, లైంగిక చర్యలకు పాల్పడుతున్న వీడియోలను ప్రజ్వల్ రేవణ్ణ ఉపయోగించి మహిళలను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు ఏప్రిల్ 26కు రెండ్రోజుల ముందే ఈ వీడియోలు హసన్ (Hasan) నియోజకవర్గం పరిధిలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
నాడే లేఖ రాసిన దేవరాజేగౌడ
గతేడాది సెప్టెంబర్ నెలలో ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరింది. దీంతో ఈ ఎన్నికల్లో కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా రేవణ్ణ రెండోసారి పోటీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ హోలెనర్సిపుర అభ్యర్థిగా దేవరాజేగౌడ పోటీ చేస్తున్న సమయంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో సహా హెచ్‌డీ దేవెగౌడ కుటుంబానికి చెందిన పలువురు నేతలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ గతేడాది డిసెంబర్ 8న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులతో పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సదరు బీజేపీ నాయకుడు ఆ లేఖలో తన అభిప్రాయాన్ని తెలిపారు.
జేడీఎస్ తో పొత్తు బీజేపీకి అప్రతిష్ట అని హెచ్చరించిన దేవరాజేగౌడ
ఆ పెన్ డ్రైవ్‌లో మొత్తం 2,976 వీడియోలు ఉన్నాయని, ఫుటేజీలో ఉన్న కొందరు మహిళలు ప్రభుత్వ అధికారులని దేవరాజే గౌడ తెలిపారు. ఆ వీడియోలు సదరు మహిళల్ని లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించబడ్డాయని తెలిపారు. మనం జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఆ వీడియోలు కాంగ్రెస్ పార్టీ కి తిరుగులేని బ్రహ్మాస్త్రాలుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతిష్టకు పెద్ద దెబ్బే నని దేవరాజేగౌడ తన లేఖలో పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ పార్టీకి ఇబ్బందికరంగా మారినందున ఆయనను బహిష్కరించాలని కోరుతూ ఆదివారం జేడీ(ఎస్) ఎమ్మెల్యే శరణగౌడ కంద్కూర్ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడకు లేఖ రాశారు.