Sex Scandal Vedio-Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ పాత్రపై విచారణ జరపాలి...జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్
ఈ వార్తాకథనం ఏంటి
మూడవ దశ లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమరం కర్ణాటక (Karnatka)లో మరింత రసవత్తరంగా సాగుతోంది.
ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) సెక్స్ వీడియో (Sex Scandal) ఒకటి హసన్ (Hasan)లోక్ సభ నియోజకవర్గంలో బాగా సర్కులేట్ అవుతోంది.
దీంతో ప్రజ్వల్ రేవణ్ణ శనివారం భారత్ ను వీడి జర్మనీ (Germoney)లోని ఫ్రాంక్ ఫర్డ్ కు బయలుదేరి వెళ్లారు.
బాగా వైరల్ అవుతున్న ఈ సెక్స్ వీడియోలో ప్రజ్వల్ రేవణ్ణ పాత్రపై వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidharamaiha)విచారణకు ఆదేశించారు.
ఈ వీడియోలో మహిళల లైంగిక వేధింపులపై కూడా విచారణ జరపాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
Sex Scandal-Prajwal Row
మార్ఫింగ్ చేసిన వీడియో అది: ప్రజ్వల్
ఈ సెక్స్ వీడియో మార్ఫింగ్ చేసిందని తనకు ఏ మాత్రం సంబంధం లేదని ప్రజ్వల్ రేవణ్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే ఈ వీడియోపై బీజేపీ (BJP), జనతా దళ్ (JD) (సెక్యులర్) పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఉన్నట్టుండి అకస్మాత్తుగా ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియో బయటకు రావడం పై ఈ రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
తమను దెబ్బతీసేందుకు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు సృష్టించి ప్రజ్వల్ ను ఓడించాలని చూస్తున్నారని ఆ పార్టీలు ఆరోపించాయి.
సెక్స్ వీడియో బయటకు రావడంపై విచారణ జరపాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
దీంతో సిద్ధమయ్యా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.