Page Loader
Loksabha Elections 2024: ఏప్రిల్ 30న మణిపూర్‌లోని 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

Loksabha Elections 2024: ఏప్రిల్ 30న మణిపూర్‌లోని 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

వ్రాసిన వారు Stalin
Apr 28, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్(Manipur)పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికలను(Elections)భారత ఎన్నికల సంఘం(Central Election Commission)శనివారం చెల్లదని ప్రకటించింది. ఈ స్టేషన్లలో ఈనెల 30న తాజా రీపోలింగ్(Re Polling)నిర్వహించేందుకు మణిపూర్ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా మెరుగుపడిందని ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్(N.Biren Singh)విజ్ఞప్తి చేశారు. భారీ భద్రత మధ్య పోలింగ్‌ జరిగిన మణిపూర్‌ రాష్ట్రంలో 77.32 శాతం పోలింగ్‌ నమోదైంది. అనుమానిత ఉగ్రవాదులు చేసిన బెదిరింపుల సంఘటనలతో ఎన్నికల ప్రక్రియ దెబ్బతింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్నికల కమిషన్​ రీపోలింగ్​ కు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు