World Telugu Conferences: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అమలాపురంలో సాంస్కృతిక వేడుకల ఆరంభం
ఈ వార్తాకథనం ఏంటి
మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు ఈ సంవత్సరం కేంద్రమైన కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం పట్టణంలోని కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. సభా ఏర్పాట్లను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) ఆధ్వర్యంలో చేపట్టారు. భారీ వేదికను సిద్ధం చేసి, దానికి నందమూరి తారక రామారావు పేరు పెట్టారు.
Details
ప్రసంగకర్తలుగా చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు
సభా తొలి రోజున ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రులు కె. రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొననున్నారు. అలాగే ప్రసంగకర్తలుగా చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు రానున్నారు. సభా ఏర్పాట్లను కలెక్టర్ ఆర్. మహేశ్‌కుమార్ శుక్రవారం పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.