US, Russian Astronauts: 8 నెలల అంతరిక్ష యాత్ర ముగించి భూమికి చేరుకున్న వ్యోమగాములు
ఈ వార్తాకథనం ఏంటి
భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో దాదాపు ఎనిమిది నెలల పాటు విధులు నిర్వహించిన అమెరికా, రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఆదివారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్‌తో పాటు రష్యా వ్యోమగాములు సెర్గీ కుద్ స్వెర్చ్‌కోవ్, సెర్గీ మికాయెవ్‌లు సోయుజ్ ఎంఎస్-28 వ్యోమనౌకలో ప్రయాణించి కజకిస్థాన్‌లోని విస్తారమైన గడ్డి మైదానాల్లో విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. భూమికి చేరుకునే చివరి దశలో వ్యోమనౌకకు అనుసంధానమైన పారాచూట్లు సక్రమంగా తెరుచుకోవడంతో స్పేస్‌క్రాఫ్ట్ నెమ్మదిగా, సురక్షితంగా నేలను తాకింది. ఈ అంతరిక్ష యాత్ర క్రిస్ విలియమ్స్, సెర్గీ మికాయెవ్‌లకు తొలి మిషన్ కాగా, సెర్గీ కుద్ స్వెర్చ్‌కోవ్‌కు ఇది రెండో అంతరిక్ష యాత్రగా నిలిచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎనిమిది నెలల మిషన్ పూర్తి.. కజకిస్థాన్‌లో దిగిన వ్యోమగాములు
WELCOME BACK TO EARTH!
— RT (@RT_com) July 26, 2026
Soyuz MS-28 spacecraft lands in Kazakhstan after ISS mission
Crew:
🇷🇺Cosmonaut Sergey Kud-Sverchkov
🇷🇺Cosmonaut Sergey Mikaev
🇺🇸Astronaut Christopher Williams pic.twitter.com/k1NaratuIj