Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' సినిమాలతో వెంకటేష్‌లోని బెస్ట్ కామెడీ టైమింగ్‌ను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల కలయికలో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం కొనసాగుతోంది. నా స్టైల్‌కు తగ్గ వినోదం మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.
Details
వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్
వచ్చే సంక్రాంతి (2027)కి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా ఈ సినిమాను అందిస్తామని వెల్లడించారు. ఈప్రకటనతో వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఇంటెన్సిటీకి అనిల్ రావిపూడి మార్క్ హాస్యం జతకలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి మంచి సెంటిమెంట్‌గా నిలిచింది. గతంలో ఆయన విడుదల చేసిన సంక్రాంతి చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించాయి. ఇప్పుడు అదే సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఇద్దరు ప్రముఖ హీరోలను ఒకే వేదికపైకి తీసుకురావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నందమూరి అభిమానులతో పాటు దగ్గుబాటి అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.