వై.ఎస్.జగన్: వార్తలు
19 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.
18 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు.
18 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
16 Feb 2023
విశాఖపట్టణంవిశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్
విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్‌టన్ ఎరీనాలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్' ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం జరగనున్న ఈ ఈవెంట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాల ఆవిష్కరణలపై చర్చించనున్నారు. ఉదయం 10గంటలకు సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు.
15 Feb 2023
కడపకడప: జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
14 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.
11 Feb 2023
దిల్లీదిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్
దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
09 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
07 Feb 2023
విశాఖపట్టణంఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!
ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.
06 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.
03 Feb 2023
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఫోన్ ట్యాపింగ్: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరువర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి.
31 Jan 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.
06 Jan 2023
ఆంధ్రప్రదేశ్వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు: సీఎం జగన్
డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డిజిటల్ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
06 Jan 2023
ఆంధ్రప్రదేశ్సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది.
03 Jan 2023
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం
రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
30 Dec 2022
చంద్రబాబు నాయుడుపవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు.
29 Dec 2022
భూపేంద్ర యాదవ్'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు
దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్ ప్రోటోకాల్స్, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌కు జగన్ ఫిర్యాదు చేశారు.
26 Dec 2022
ఆంధ్రప్రదేశ్చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ.
23 Dec 2022
ఆంధ్రప్రదేశ్టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
22 Dec 2022
ఆంధ్రప్రదేశ్'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు
ఏపీ సీఎం జగన్‌పై సంచనల ఆరోపణలు చేశారు కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా అందులో అవినీతి కోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బైజూస్ తో ఒప్పందం విషయంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని, ఫలితంగా రూ. 1400 కోట్లు వృథా అవుతోందని సంచలన ఆరోపణపు చేశారు.
21 Dec 2022
వై ఎస్ రాజశేఖర్ రెడ్డివిదేశాల్లో సేవా కార్యక్రమాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానులు చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ క్యాడర్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
20 Dec 2022
చంద్రబాబు నాయుడుమూడు రాజధానులు V/S ఒక రాజధాని..!
ఏపీలో అప్పుడే రాజకీయ వేడీ మొదలైంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపైనే వైసీపీ, టీడీపీ, జనసేన దృష్టి సారించాయి.