
ECI-Jagan: జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది.
మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ PSR ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాలను బదిలీ చేసింది.
వీరిని వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది.
Details
ఎన్నికలకి సంబంధించిన డ్యూటీలేవి అప్పగించద్దు..
లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికలకి సంబంధించిన డ్యూటీలేవి అప్పగించొద్దని నిర్దేశించింది.
వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించాలని అందుకు ... ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా బదిలీ
Breaking News..
— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) April 23, 2024
ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా బదిలీ..
2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు..
బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోగా వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున… pic.twitter.com/faV19AJlJW