Page Loader
ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?
త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?

వ్రాసిన వారు Stalin
Feb 18, 2023
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దేందుకు త్వరలో సీఎం జగన్ కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నుంచి నాలుగు మంత్రులు కేబినెట్‌లో స్థానం కోల్పోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్

చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గంలో 'కమ్మ' సామాజికవర్గానికి దక్కని ప్రాతినిధ్యం

గత ఏడాది ఏప్రిల్‌లో జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. కొందరు మంత్రుల పరితీరు ఆశాజనకంగా లేకపోవడంతో ఏడాదిలోపే జగన్ తన మంత్రివర్గాన్ని రెండోసారి పునర్వ్యవస్థీకరించేదుకు సిద్ధమయ్యారు. కేబినెట్‌లోకొందరు అసమర్థ నేతలు ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రోజా, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌, జోగి రమేష్‌లు రిస్క్‌ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పునర్వ్యవస్థీకరణ జరిగితే కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా తమ అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ ప్రాతినిధ్యం లేదు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. మరి జగన్ ఆ సామాజికవర్గంలో ఎవరినైనా చేర్చుకుంటారో లేదో చూడాలి.