CM Jagan: ఏపీ నుంచి ఓ ఐపీఎల్ ఉండాలి
భవిష్యత్తులో ఏపీ నుంచి ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అదేశించారు. రాష్ట్రంలో క్రికెట్ జట్టుకు చైన్నై సూపర్ కింగ్స్ మార్గనిర్దేశం చేయనుందని పేర్కొన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మూడు క్రికెట్ మైదానాలకు క్రికెట్ కార్యక్రమాల కోసం చైన్నై సూపర్ కింగ్స్ అప్పగిస్తామని, తెలుగు రాష్ట్రాలకు అంబటి రాయుడు, కేఎస్ భరత్ లాంటి వారు యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. అదే విధంగా భవిష్యతులో ముంబై ఇండియన్స్ లాంటి జట్ల సాయం తీసుకుంటామని, దీంతో ప్రోఫెషనలిజం బాగా పెరుగుతుందన్నారు.
నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి
'ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించే క్రీడా పోటీలను ప్రతి ఏడాది నిర్వహించాలని, దీని కోసం ప్రతి మండలంలో క్రీడా మైదాలను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయానికి కూడా భవిష్యత్తులో కిట్లు ఇచ్చే ఆలోచనలు చేయాలని, నియోజకవర్గానికో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించానల్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి అమర్‌నాథ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.