ఏపీ సీఎంతో టీమిండియా వికెట్ కీపర్.. సీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీమిండియా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ గురువారం బేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని శ్రీకర్ భరత్ మర్వాదపూర్వకంగా కలిశారు.
అనంతరం టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీని సీఎం జగన్‌కు భరత్ బహుకరించారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించినందుకు భరత్ ను సీఎం జగన్ అభినందించారు.
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం భరత్ విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన మొదటి క్రికెటర్ ను తానే కావడం చాలా గర్వంగా ఉందన్నారు.
Details
క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
తనలాంటి యువ క్రికెటర్లకు సీఎం స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. అదే విధంగా దేశం గర్వపడేలా, రాష్ట్ర ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం జగన్, తనకు సూచించారని భరత్ తెలిపారు.
క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఇదే ప్రోత్సాహం లభిస్తే తనలాంటి చాలామంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తనకు ఒక ఇన్సిపిరేషన్ అన్నారు
ఈ సమవేశంలో భరత్‌తో పాటు అతని తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్ కృష్ణరావు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హజరయ్యారు.