డబ్ల్యూటీసీ ఎఫెక్టు: పుజారా ఔట్.. యశస్వీ ఇన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా చెత్త ప్రదర్శనతో దారుణంగా విఫలమయ్యాడు.
పేలవమైన షాట్ ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో మాజీ క్రికెట్లు అతని ఆట తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో పుజారాను పక్కనపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. జులై 12న డొమినికాలో టెస్టు మ్యాచ్‌తో టీమిండియా పోరు మొదలు కానుంది.
ఈ టెస్టు జట్టులో పుజారా స్థానంలో ఐపీఎల్ విజృంభించిన రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. స్టాండ్ బైగా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం యశస్వీ ఇంగ్లాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
Details
పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్న పుజారా
పుజారా భారత టెస్టు జట్టులో నంబర్ 3 లో కీలక బ్యాటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కొంతకాలంగా పేలవమైన ఫామ్ ఉన్న అతను 2020 నుంచి ఇప్పటి వరకూ పుజారా బ్యాట్ నుంచి 52 ఇన్నింగ్స్ లలో ఒక సెంచరీ మాత్రమే ఉంది. దీంతో పుజారా సగటు 26.69గా నిలిచింది.
ఇలాంటి పరిస్థితుల్లో వెస్టిండీస్ సిరీస్ లో పుజారా రాణించడం కష్టమని సెలక్టర్లు భావిస్తున్నారు. జైస్వాల్ ఐపీఎల్ 14 మ్యాచులు ఆడి 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చివరి నిమిషంలో అతను బ్యాకప్ ప్లేయర్ ఎంపికయ్యాడు. రుతురాజ్ వివాహం కారణంగా అతని స్థానంలో జైస్వాల్ కు అవకాశం దక్కింది.