Page Loader
వెస్టిండీస్ టూరులో భారీ మార్పులు.. టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ!
టీమిండియా ప్లేయర్ హార్ధిక్ పాండ్యా

వెస్టిండీస్ టూరులో భారీ మార్పులు.. టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో సీనియర్ ఆటగాళ్లపై ప్రభావం పడింది. వెస్టిండీస్ టూరులో సీనియర్లను పక్కన పెట్టి, కొత్త ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. టెస్టులో సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేక టీమిండియా ఎన్నో ఏళ్లుగా సతమతమవుతోంది. శార్ధుల్‌ఠాకూర్ కొన్ని మ్యాచుల్లో చెలరేగినా పూర్తిస్థాయిలో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకోలేకపోతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. అదే విధంగా బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో హార్ధిక్ పాండ్యాను తిరిగి టెస్టు జట్టులో స్థానం కల్పించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2018 ఆగస్టులో చివరిసారిగా హార్ధిక్ పాండ్యా టెస్టు మ్యాచును ఆడాడు.

Details

అద్భుత ఫామ్ లో మోహిత్ శర్మ

11 టెస్టుల్లో 17 వికెట్లు తీసిన హార్ధిక్, బ్యాటింగ్ విభాగంలో ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలను బాదాడు. వెస్టిండీస్ టూర్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే టెస్టుల్లో హార్ధిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన మోహిత్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 2015లో ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు చివరిసారిగా టీమిండియా తరుపున మ్యాచును ఆడాడు. 2015 వన్డే వరల్డ్ కప్ తర్వాత అతను జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పటివరకూ 26 వన్డేల్లో 31 వికెట్లను పడగొట్టాడు.