సోషల్ మీడియా సన్సేషన్‌గా హార్ధిక్ పాండ్యా.. నాదల్, ఫెదరర్‌ను వెనక్కినెట్టాడు
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీమిండియా స్టార్ హార్ధిక్ పాండ్యా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు టీమిండియాకు నాయకత్వం వహించి అద్భుత విజయాన్ని అందించారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడల్లా జట్టు పగ్గాలను అందుకుంటున్నాడు. సోషల్ మీడియా ఫ్టాంట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా రికార్డుకెక్కాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ధిక్ పాండ్యా 25 మిలియన్లు(రెండున్నర కోట్లు) ఫాలోవర్లను అత్యంత చిన్న వయస్సులో సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, ఎర్లింగ్ హాలాండ్ వంటి గ్లోబల్ స్టార్ ల కంటే హార్ధిక్ ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగిన క్రీడాకారుడిగా నిలిచాడు.
హార్ధిక్ పాండ్యా
మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు
తనపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు ప్రత్యేక ధన్యవాదలని, ఇన్నాళ్లుగా తనపై ప్రేమను కురిపిస్తూ మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హార్ధిక్ పాండ్యా పోస్టు చేశాడు.
హార్దిక్ పాండ్య ఇన్‌స్టాలోనే కాకుండా ట్విటర్‌లో 8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇటీవల తన భార్య నటాషాను మరోసారి క్రిస్టియన్ సంప్రదాయంతో హార్ధిక్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హార్ధిక్, నాటాసా తమతమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేయగా అవి వైరల్‌గా మారాయి.