Page Loader
న్యూజిలాండ్‌పై  హార్ధిక్ పాండ్యా సూపర్ ఫర్మామెన్స్
న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా

న్యూజిలాండ్‌పై హార్ధిక్ పాండ్యా సూపర్ ఫర్మామెన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2023
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యా సూపర్ ఫర్మామెన్స్ తో చేలరేగిపోయాడు. న్యూజిలాండ్ ని 66 పరుగులకే కట్టడి చేయడంతో హార్ధిక్ కీలక పాత్ర పోషించాడు. మూడో టీ20లో 4/16తో రాణించడంతో టీమిండియా 168 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసింది. శుభమాన్ గిల్ తో కలిసి 103 కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 234 పరుగులను చేసింది. శుభమాన్ గిల్ 63 బంతుల్లో 126 పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కాడు. అంతర్జాతీయ టి20ల్లో గిల్‌కు ఇదే తొలి శతకం. ఓవరాల్‌గా భారత్ నుంచి అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన 7వ ప్లేయర్‌గా నిలిచాడు

హార్ధిక్ పాండ్యా

ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా హార్ధిక్ పాండ్యా

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ రెండో ఓవర్ లోనే ఇషాన్ కిషన్ (1) వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్, రాహుల్ త్రిపాఠి సమిష్టిగా రాణించడంతో భారత్ 80 పరుగులు దాటింది. శుభ్‌మాన్ నాటౌట్‌గా నిలవగా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ చివర్లో చేలరేగిపోవడంతో భారత్ టీ20ల్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. హార్దిక్ జనవరి 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్ లో 87 మ్యాచ్‌లలో 26.43 సగటుతో 69 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 1271 పరుగులను సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాతో అత్యధికంగా 70 పరుగులు చేశాడు. గతంలో 143 పరుగుల తేడాతో ఐర్లాండ్ భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే.