Page Loader
శుభ్‌మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు
వన్డేల్లో వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన రెండవ బ్యాటర్‌గా గిల్

శుభ్‌మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2023
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

శుభ్‌మాన్‌ గిల్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ చేసి సత్తా చాటాడు. కేవలం 87 బంతుల్లో వంద పరుగులు చేశాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ (34) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో నిరాశ పరచగా.. గిల్ వేగంగా పరుగులు సాధించాడు. గిల్ వన్డేల్లో వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు. 19 మ్యాచ్‌లలో ఈ మైలురాయిని సాధించి సత్తా చాటాడు

శుభ్‌మాన్ గిల్

గిల్ 135 బంతుల్లో 168

పాకిస్థాన్‌కు చెందిన ఫఖర్ జమాన్ 18 మ్యాచ్‌లో 1000 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో 2019లో జరిగిన వన్డే మ్యాచ్‌లో‌‌ గిల్ అరంగేట్రం చేశాడు. చివరి ఏడు వన్డేలో వరుసగా 116, 21, 70, 13, 45*, 50,49 పరుగులు చేశాడు. గిల్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో 816 పరుగులు చేశాడు. గిల్ 15 మ్యాచ్‌లలో 54.40 సగటున రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 29.66 సగటుతో 178 పరుగులు చేశాడు. ప్రస్తుతం మొదటి వన్డేలో గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.