Page Loader
'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా
హార్ధిక్ పాండ్యా

'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2023
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత టీ20 కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్ధిక్ పాండ్యా మీద ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ముంబై వేదికగా నేడు శ్రీలంకతో తలపడేందుకు హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. తొలి టీ20కు ముందు విలేకర్ల సమావేశంలో హార్ధిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్ గెలవడమే ఈ ఏడాది మా జట్టు అతి పెద్ద రిజల్యూషన్. నిజంగా ప్రపంచ కప్‌ను గెలవాలనుకుంటున్నాము. అందుకోసం అన్ని విధాల మేము సన్నద్దం అవుతున్నామని హార్ధిక్ వెల్లడించారు.

హార్ధిక్

'వందశాతం ఎఫెక్టు పెట్టేందుకు సిద్ధం'

ప్రస్తుతం మేము అన్ని విభాగాల్లో బలంగా ఉన్నాం. కాబట్టి ఈ ఏడాది ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. గతేడాది మేము మెరుగైన ప్రదర్శన చేసినా కూడా టీ20 ప్రపంచ కప్ ను గెలవలేకపోయాం. ఈ సారి మా లక్ష్యాన్ని కచ్చితంగా నేరవేరుస్తాం. ఈ ఏడాది ప్రపంచకప్‌లో కూడా 100% శాతం ఎఫక్ట్‌ పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. అంతకంటే ముందు శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లపై మేము దృష్టి సారించాల్సి ఉంది" అని ఆయన పేర్కొన్నాడు. హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది జట్టులో నూతన ఉత్సాహం నింపుతాడో లేదో వేచి చూడాల్సిందే..