ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై..? సీఎస్కే ఎమోషనల్ పోస్టుతో ఫ్యాన్స్ ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి రోజూ ఏదోక చర్చ కొనసాగుతూనే ఉంది. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహి తప్పుకున్నాడు. 2021లో చైన్నై సూపర్ కింగ్స్ కి నాలుగో టైటిల్ ను అందించాడు.
2022 ఐపీఎల్ ఆరంభంలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జడేజా కెప్టెన్ గా వ్యవహరించాడు. అతను ఫెయిల్ కావడంతో మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలను తీసుకున్నాడు.
2023 ఐపీఎల్ లో కెప్టెన్ గా ఐదవ టైటిల్ అందుకొని సత్తా చాటాడు. అయితే ఈ సీజన్ మొత్తం ధోని మోకాలి గాయంతో బాధపడిన విషయం తెలిసిందే.
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై చైన్నై సూపర్ కింగ్స్ పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
Details
ఓ కెప్టెన్ మై కెప్టెన్ అంటూ సీఎస్కే ట్వీట్
తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ గురించి 'ఓ కెప్టెన్, మై కెప్టెన్' అంటూ సీఎస్కే ఓ వీడియోను పోస్టు చేసింది.
ఈ ట్వీట్ చూసిన అభిమానులు రిటైర్మెంట్ పై ధోనీ నిర్ణయం తీసుకున్నట్లు అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఐపీఎల్ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్లు అర్థం వచ్చేట్లు ఈ వీడియోను సీఎస్కే పోస్టు చేయడం విశేషం.
ప్రస్తుతం ధోని వయస్సు 41 ఏళ్లు. వచ్చే నెలలో 42ను పూర్తి చేసుకుంటున్నాడు. ముఖ్యంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ వచ్చే సీజన్లో ఐపీఎల్ ఆడడం అనుమానంగానే ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఎస్కే పోస్టు చేసిన వీడియో
Oh Captain, My Captain! 🥹#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/whJeUjWUVd
— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023