
ధోనీ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. మహి ఆపరేషన్ సక్సెస్
ఈ వార్తాకథనం ఏంటి
చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మోకాలి సర్జరీ సక్సెస్ అయింది. ఐపీఎల్లో అడుతూ ధోని గాయానికి గురైన విషయం తెలిసిందే.
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో గురువారం ధోని మోకాలికి సర్జరీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్జరీ సక్సెస్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
స్పోర్ట్స్ అర్ధోపెడిక్స్‌లో నిపుణుడు అయిన దిన్షా పార్ధివాలా ఈ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన స్పోర్ట్స్ మెడిసన్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
ధోనీ శస్త్ర చికిత్స విషయాన్ని చైన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ధోనీ బాగానే ఉన్నాడని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని పేర్కొన్నారు.
Details
ఫిట్ గా ఉండటానికే సర్జరీ చేయించుకున్న ధోనీ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు కూడా దిన్షా పార్ధివాలా చికిత్స అందించాడు.
రిషబ్ పంత్ త్వరగా కోలుకోవడం చూసిన ధోనీ కూడా ఆస్పత్రిలో చికిత్స చేసుకోవడానికి ఇష్టపడినట్లు సమాచారం. ముఖ్యంగా ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచిన 48 గంటల్లోనే ధోనీ సర్జరీ చేసుకోవడం గమనార్హం.
ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ అనంతరం మోకాలికి క్యాప్ పట్టుకొని ధోని కనిపించాడు. దీంతో ధోనీ ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. శస్త్రచికిత్స అనంతరం ధోనీ భగవద్గీత చదువుతూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటానికి ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.