అతను ఉంటే ఫెయిర్ ప్లే అవార్డును ఎప్పటికీ గెలవలేను: ఎంఎస్ ధోని
టీమిండియా మాజీ ఆటగాడు, చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటిరాయుడిపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ ను చివరి బంతికి ఓడించి సీఎస్కే ట్రోఫీని నెగ్గింది. దీంతో ఐపీఎల్ టోర్నీలో ఐదు టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా సీఎస్కే అవరించింది. మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోని రాయుడు గురించి మాట్లాడారు. రాయుడు అద్భుత క్రికెటర్ అని, అతను మైదానంలో వందశాతం రాణిస్తాడని, రాయుడు ఉంటే తాను ఫెయిర్ ఫ్లే అవార్డును గెలవలేనని మహీ సరదాగా చెప్పుకొచ్చాడు. అద్భుతంగా కెరీర్‌ను ముగించిన రాయుడు జీవితంలోని తర్వాతి దశను సంతోషంగా గడపాలని ధోనీ ఆకాంక్షించాడు.
రాయుడు అద్భుత క్రికెటర్ : ధోని
భారత జట్టు ఏ జట్టు నుంచి రాయుడు తెలుసు అని.. స్పిన్, పేస్ ను బాగా ఆడతాడని, ఐపీఎల్ 2023 ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడని ధోనీ కొనియాడారు. చైన్నై జట్టు తనకు ఐపీఎల్ ట్రోఫీని గిఫ్ట్ గా ఇచ్చింది. తాను రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 6-7 సమయం ఉందని, అభిమానులు మైదానంలో తన పేరును పలుకుతుంటే డగౌట్ లో ఉన్న తన కళ్లలో నీళ్లు తిరిగాయని పేర్కొన్నారు. రాయుడుకి ఇది 6వ ఐపీఎల్ టైటిల్ కావడంతో రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.