తదుపరి వార్తా కథనం

Jayamangala venkata ramana: వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్ బై చెప్పిన కైకలూరు ఎమ్మెల్సీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 23, 2024
01:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి పార్టీకి గుడ్ బై చెప్పారు.
కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపారు. జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించారు.
అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఎదుర్కొన్న ఘోర పరాజయం తర్వాత, పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు.