Adani-YS Jagan: అదానీ స్కామ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు..!
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ కేసు కీలక లింకులు బయటపడుతున్నాయి. అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసింది. భారతదేశంలో భారీ సౌరశక్తి ప్రాజెక్టును దక్కించుకోవడానికి అధిక అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వ అధికారులకు భారీగా లంచాలు అందజేసినట్టు కేసులో ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌తో లింకులు
ఆమోదించిన సౌరశక్తి ప్రాజెక్టులో 2029 కోట్ల రూపాయల లంచాలు అందించినట్లు పేర్కొనబడింది. 2021లో ఈ లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక అధికారులు పాల్గొన్నారని, వారి ప్రమేయంతో లంచాలు చెల్లించబడినట్టు కోర్టు పేర్కొంది. జగన్ ప్రభుత్వ హయాంలో అభియోగాలు 2021లో గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశమై, ప్రాజెక్టుకు అనుకూలంగా ఒప్పందాలు కుదిరేందుకు 1750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారనే అభియోగాలు ఉత్పన్నమయ్యాయి. 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ వ్యవహారంలో ప్రభుత్వంలోని కీలక అధికారుల పాత్రపై ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ ప్రభావం
ఈ కేసు రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఒప్పందాల వెనుక ఉన్న అసలైన కారణాలను వెలుగులోకి తెచ్చేందుకు దీనిపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.