కడప: జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
అనంతరం స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభోత్సవానికి ఎక్కువ మందిని పిలవలేకపోయామని చెప్పారు. ఈ ఉక్కు కర్మాగారం రాయలసీమ, కడప ప్రజల కల అని చెప్పారు. వైఎస్ఆర్ మరణానంతరం ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు.
కడప
ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి: జగన్
రూ.8,800 కోట్లతో సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌ను చేపడుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు.
ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్ కోసం చాలా కష్టపాడాల్సి వచ్చిందన్నారు.
స్టీల్‌ప్లాంట్ వస్తే ఈ ప్రాంతం ఉక్కు నగరంగా అభివృద్ధి చెందుతుందని జగన్ చెప్పారు. ఈ ప్లాంట్ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
మొదటి విడతలో రూ.3,300 కోట్ల వ్యయంతో 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నట్లు జగన్ ప్రకటించారు.